(Local) Sat, 11 Jul, 2020

మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్‌పోర్ట్

November 30, 2019,   1:41 PM IST
Share on:
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్‌పోర్ట్

ఢిల్లీ సమీపంలో అతిపెద్ద విమానాశ్రయం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఢిల్లీ శివారులోని నోయిడా వద్ద దాదాపు ఐదు వేల హెక్టార్ల విస్తీర్ణంలో రూ.29,560 కోట్ల ఖర్చుతో నిర్మించే జేవార్ విమానాశ్రయం బిడ్‌ను స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ ఏజీ దక్కించుకొన్నది. శుక్రవారం నోయిడాలోని ఎయిర్‌పోర్ట్‌లో ఫైనాన్షియల్ బిడ్లను తెరిచారు. విమానాశ్రయ నిర్మాణ పనులను దక్కించుకోవడానికి అదానీ గ్రూప్, యాంకరేజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ హోల్డింగ్స్, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ కంపెనీ (డయల్)లు పోటీపడగా.. చివరకు జ్యూరిచ్ కంపెనీకి బిడ్ దక్కింది. 

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఘజియాబాద్‌లోని హిండాన్ విమానాశ్రయం తర్వాత మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్‌పోర్ట్ నిలువనున్నది. ఈ విమానాశ్రయంలో ఆరు నుంచి ఎనిమిది రన్‌వేలు నిర్మించనున్నారు. 1,334 హెక్టార్లలో నిర్మించే తొలి దశ పనులు 2023 నాటికి పూర్తిచేసేలా ఒప్పందం కుదిరింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (ఎన్‌ఐఏఎల్)ఈ మెగా ప్రాజెక్టు పనులను పర్యవేక్షించనున్నది.  

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.