(Local) Fri, 13 Dec, 2019

రద్దీ తక్కువగా ఉండే రైళ్లలో 25 శాతం రాయితీ

August 28, 2019,   2:46 PM IST
Share on:
రద్దీ తక్కువగా ఉండే రైళ్లలో 25 శాతం రాయితీ

శతాబ్ది, తేజాస్, ఇంటర్‌సిటీ, కొన్ని డబుల్ డెక్కర్ రైళ్లలో చెయిర్ కార్లు, ఎగ్టిక్యూటివ్ సీట్ల చార్జీలపై 25 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని రైల్వే భావిస్తున్నాయి. ఖాళీ సీట్లతో ఈ రైళ్లు నడవకుండా మరింత మంది  ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఈ చర్యలు చేపట్టాలని రైల్వేలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రద్దీ తక్కువగా ఉండే రైళ్లకే ఈ రాయితీ వర్తించే అవకాశం ఉంది. ఆయా రైల్వే జోన్‌కు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకే ఏ రైళ్లకు ఈ రాయితీని వర్తింపచేయాలో నిర్ణయించే అధికారాన్ని వదిలేస్తారని తెలుస్తోంది. బేసిక్ ఛార్జీపైనే ఈ రాయితీ అందచేస్తారు. జిఎస్‌టి, రిజర్వేషన్ ఛార్జీ, సూపర్‌ఫాస్ట్ టారిఫ్, తదితర ఛార్జీలను మాత్రం విడిగా వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ రద్దీతో నడిచే రైళ్లను సెప్టెంబర్ 30లోగా గుర్తించాలని అన్ని రైల్వే జోన్లను రైల్వే బోర్డు ఆదేశించినట్లు తెలుస్తోంది.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.