(Local) Thu, 21 Nov, 2019

ఆర్‌బిఐ నుంచి ఋణం అంటే బ్యాండ్-ఎయిడ్‌ని దొంగలించడమే

August 27, 2019,   2:56 PM IST
Share on:
ఆర్‌బిఐ నుంచి ఋణం అంటే బ్యాండ్-ఎయిడ్‌ని దొంగలించడమ ...

తమ స్వయంకృతాపరాధం వల్లే ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని ఎలా నివారించాలో ప్రధాని మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అంతుబట్టడం లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆర్‌బిఐ నుంచి అప్పులు తేవడం వల్ల ప్రయోజనం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. విమల్ జలాన్ కమిటీ సిఫారుల మేరకు కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.46 లక్షల కోట్ల నిధులను బదిలీ చేయాలని ఆర్‌బిఐ సోమవారం తీసుకున్న నిర్ణయంపై రాహుల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తామే సృష్టించిన ఆర్థిక పతనం నుంచి  ఎలా బయటపడాలో ప్రధానికి, ఆర్థిక మంత్రికి అంతుపట్టడం లేదు. ఆర్‌బిఐ నుంచి దొంగతనం చేయడం వల్ల ప్రయోజనం లేదు. తుపాకీ తూటా వల్ల ఏర్పడిన గాయంపై అతికించేందుకు డిస్పెన్సరీ నుంచి బ్యాండ్-ఎయిడ్‌ని దొంగలించడం లాంటిదే ఇది కూడా& అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు,

సంబంధిత వర్గం
ఇందిరమ్మ జయంతి...నివాళులర్పిస్తున్న ప్రముఖులు
ఇందిరమ్మ జయంతి...నివాళులర్పిస్తున్న ప్రముఖులు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.