(Local) Tue, 29 Sep, 2020

చిదంబరం దంపతులకు షాక్

August 25, 2019,   12:46 PM IST
Share on:
చిదంబరం దంపతులకు షాక్

కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, ఆయన సతీమణి సుప్రీంకోర్టు అడ్వకేట్ నళినికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. సీనియర్ అడ్వకేట్ హోదాను దంపతులిద్దరూ దుర్వినియోగం చేశారని నోటీసులో పేర్కొంది. సెప్టెంబరు 28న ఉదయం 11.30 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని బార్ కౌన్సిల్ ఆదేశించింది. బార్ కౌన్సిల్ సీనియర్ సభ్యుడు జె. గోపాలకృష్ణన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్థిక నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం దంపతులు సీనియర్ అడ్వకేట్లుగా ఎలా సుప్రీం కోర్టు కు హాజరవుతారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పంపగా నలుగురు సభ్యుల కమిటీ దీనిపై విచారణ  చేపట్టి నోటీసులు జారీ చేసింది.

సంబంధిత వర్గం
చిదంబరానికి మరోసారి నిరాశ
చిదంబరానికి మరోసారి నిరాశ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.