(Local) Mon, 12 Apr, 2021

ఆర్ బి ఐ షాక్ : 2000 నోట్ల ప్రింటింగ్ బంద్

October 16, 2019,   12:58 PM IST
Share on:
ఆర్ బి ఐ షాక్ : 2000 నోట్ల ప్రింటింగ్ బంద్

రూ.2 వేల నోట్లను  తాము ఇప్పుడు ముద్రించడం లేదని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-2020లో రూ.2 వేల నోటును ఒక్కదాన్ని కూడా తాము అచ్చేయలేదని వెల్లడించింది. ఓ మీడియా సంస్థ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్ర బ్యాంకు గణాంకాలతో వివరాలు అందించింది.  2017లో రూ .2 వేల కరెన్సీ నోట్లను 354.2991 కోట్లను, 2018లో 11.507 కోట్లను అచ్చేశామని, తర్వాత 4.6690 కోట్లను ముద్రించామని వివరించింది. కాగా, నల్లధనాన్ని అడ్డుకోడానికి వీలుగా వాటి ముద్రణను అటకెక్కించామని ఆర్బీఐ అధికారులు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మోదీ ప్రభుత్వం 2016 నవంబరులోరూ.500, రూ.1000 నోట్లను రాత్రిపూట రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త రూ. 500, రూ. 2వేల నోట్లను పట్టుకురావడం తెలిసిందే. 

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.