
ఈ మధ్య కోట్ల బడ్జెట్ పెట్టి తీసే స్టార్ సినిమాలకే కాదు మంచి కంటెంట్ తో వచ్చే చిన్న బడ్జెట్ సినిమాలను కూడా ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించడం చూస్తూనే ఉన్నాం. అలాంటి పంథాలో వస్తున్న మరో సినిమా రాజావారు రాణిగారు. ప్రేమకథలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి., కానీ ప్రతి ప్రేమ కథలోనూ ఒక ట్విస్ట్ కచ్చితంగా ఉంటుంది. పాతతరం కథలు నుంచి నేటి కాలం లవ్ స్టోరీస్ చాలా వరకూ విజయాలు నమోదు చేసుకున్నాయి. అలాంటి ప్రేమ కథను ఎవరు ఎంత కొత్తగా చెబితే.. అంతగా విజయం సాధిస్తారు. ‘రాజావారు - రాణిగారు’ కూడా ప్రేమకథే. పాతికేళ్ళు నిండని ఓ కుర్రాడు దర్శకత్వం వహించిన సినిమా 'రాజావారు రాణిగారు'. దర్శకుడిగా రవికిరణ్ కోలాకు ఇదే తొలి సినిమా. హీరో హీరోయిన్లు, నిర్మాతలు, సినిమాలో కమెడియన్లు... ఆల్మోస్ట్ అందరికీ తొలి చిత్రమే. కొత్తవాళ్లు అందరూ కలిసి చేసిన ఈ ప్రయత్నం ఎలా ఉంది? ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ఈ బృందం, సినిమాతో ఆకట్టుకుంటుందా? కాగా ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ: శ్రీరామపురం అనే గ్రామంలో రాజా (కిరణ్), రాణి (రహస్య) ఇద్దరు ఇంటర్ చదువుతుంటారు.రాణీ పై చదువుల కోసం అమ్మమ్మవాళ్ల ఊరు వెళ్లిపోతుంది. తన కోసం ఎదురుచూస్తూ రామాపూరంలోనే గడిపేస్తుంటాడు రాజా. మూడేళ్లయినా రాణి ఊళ్లోకి రాకపోవడంతో రాజా స్నేహితులు రాణిని ఊరికి రప్పించడానికి ఒక మంచి పథకం వేస్తారు. ఆ ప్లాన్ సక్సెస్ అయ్యి రాణి ఊరికి తిరిగొస్తుంది. మరి అలా ఊరికి వచ్చిన రాణికి రాజా తన ప్రేమని తెలియజేశాడా, అతని ప్రేమని ఆమె ఒప్పుకుందా.. లేదా? అనేది తెరమీద చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్ : కిరణ్, రహస్య గోరక్లకు ఇదే తొలి సినిమా. కిరణ్ బాగా నటించాడు. పల్లెటూరి అబ్బాయి పాత్రలో ఇమిడిపోయాడు. తన మనసులోని మాట చెప్పుకోలేక, లోపల దాచుకోలేక మధన పడే పాత్రలో మంచి మార్కులు కొట్టేస్తాడు. రహస్య ఓకే అనిపిస్తుంది. కథానాయికలో గ్లామర్ కంటే, పల్లెటూరి స్వచ్ఛతకే దర్శకుడు ప్రాధాన్యం ఇచ్చినట్టున్నాడు. రాజా స్నేహితులుగా చేసిన రాజ్ కుమార్ కసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం ఇద్దరూ సినిమాలో కడుపుబ్బా నవ్విస్తారు. నేచురల్ డైలాగ్స్, కామెడీ వర్కవుట్ అయ్యాయి. కథానాయకుడి స్నేహితులుగా కనిపించినవాళ్లు, డాక్టరు అల్లుడు, హీరో, హీరోయిన్ తండ్రి పాత్రధారులూ.. ఇలా అందరూ బాగా చేశారు. పల్లెటూరి వాతారవరణాన్ని కళ్లకి కట్టినట్లుగా చూపించారు దీనికి డైరెక్టర్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అక్కడుండే మాటలు, కామెడీ, పంచ్ లు ఇలా అన్ని కూడా చాలా పద్దతిగా అల్లుకొని తెరకెక్కించాడు.
మైనస్ పాయింట్స్ : చిన్న లైన్ ని చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయినా కూడా కథలో సీన్స్ రాసుకోవడంలో విఫలం అయ్యాడనే చెప్పాలి. క్లైమాక్స్ కి లీడ్ చేసే సీన్స్ ఆకట్టుకోవు. క్లైమాక్స్ సీన్స్ బాగా తీసినప్పటికీ సినిమాలో లవ్ ఫ్లేవర్ ని కరెక్ట్ గా డీల్ చేయలేకపోయారు.
సాంకేతిక విభాగం : కథగా చెప్పుకోవాలంటే చాలా చిన్న లైన్. మనసులోని మాట చెప్పుకోలేని ఓ ప్రేమికుడి కథ. అంతే. కానీ దాన్ని తెరపై వినోదాత్మకంగా, భావోద్వేగభరితంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగుంది. ఇక ఈ సినిమాకి విద్యా సాగర్ చింతా, అమర్ దీప్ గుత్తుల కెమెరా వర్క్ కూడా పెద్ద ప్లస్ పాయింట్. అందమైన గోదావరి అందాలని అత్యద్భుతంగా తెరపై చూపించారు ఈ సినిమాటోగ్రాఫర్స్ ద్వయం. నిర్మాతలు ఇలాంటి చిత్రాన్ని నిర్మిచినందుకు అభినందించి తీరాలి. నిర్మాతల ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.
తీర్పు: ఓ మంచి ఫీల్ గుడ్ ఎమోషన్‌తో కూడిన స్వచ్చమైన పల్లెటూరి ప్రేమ కథ.
రేటింగ్: 2.75/5
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM

నవంబర్ 29న వస్తున్న రాజావారు రాణిగారు....
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.