(Local) Sat, 26 Sep, 2020

కాశ్మీరు బయలుదేరిన రాహుల్ గాంధీ ఇతర నాయకులు

August 24, 2019,   12:50 PM IST
Share on:
కాశ్మీరు బయలుదేరిన రాహుల్ గాంధీ ఇతర  నాయకులు

కశ్మీరులో పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రతిపక్ష నాయకులతో కూడిన ప్రతినిధి బృందంతో కలసి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం విమానంలో శ్రీనగర్‌కు బయల్దేరారు. జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆ రాష్ట్రాన్ని విభజించిన అనంతరం ఆగస్టు 5వ తేదీ నుంచి అక్కడ నిషేధాజ్ఞలను కేంద్రం అమలుచేస్తోంది. ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ నాయకులు గులాం నబీ ఆజాద్, కెసి వేణుగోపాల్, ఆనంద్ శర్మ ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు దినేశ్ త్రివేది, డిఎంకె నాయకుడు తిరుచి శివ, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, లోక్‌తాంత్రిక్ జనతా దళ్ అధినేత శరద్ యాదవ్, ఆర్‌జెడి నాయకుడు మనోజ్ ఝా, ఎన్‌సిపి నేత మజీద్ మెమన్, జనతా దళ్(ఎస్) నేత డి కృపేంద్ర రెడ్డి ప్రతినిధి బృందంలోని ఇతర సభ్యులు.

సంబంధిత వర్గం
ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు
ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.