(Local) Wed, 12 May, 2021

మాలిక్ జి ... ఎప్పుడు రమ్మంటారు ...రాహుల్

August 14, 2019,   6:25 PM IST
Share on:
మాలిక్ జి ... ఎప్పుడు రమ్మంటారు ...రాహుల్

జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాశ్మీర్ లో పర్యటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తనను ఎప్పుడు రమ్మంటారని.. గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను రాహుల్ గాంధీ ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని.. అక్కడ పర్యటించి పరిస్థితులను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై స్పందించిన గవర్నర్ సత్యపాల్ మాలిక్.. కావాలంటే విమానం పంపిస్తానని వచ్చి కాశ్మీర్ లోయలో పర్యటించాలని రాహుల్ కు సవాల్ విసిరారు. గవర్నర్ సవాల్ ను స్వీకరించిన రాహుల్ గాంధీ కాశ్మీర్ లో పర్యటించేందుకు సిద్ధమేనన్నారు. మీరు పంపించే విమానం అక్కర్లేదని చెప్పారు. తనతో పాటు ప్రతిపక్ష నేతల బృందం కూడా కాశ్మీర్ లో పర్యటించి ప్రజలకు వాస్తవాలు వివరిస్తోందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన గవర్నర్.. విపక్ష నేతలను కూడగట్టి రాహుల్ గాంధీ గొడవలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఆయన పర్యటనకు షరతులు పెట్టామన్నారు. అయితే ఎలాంటి షరతులు లేకుండా పర్యటించేందుకు సిద్ధమేనని రాహుల్ ప్రకటించారు.

సంబంధిత వర్గం
ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు
ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.