(Local) Sun, 20 Jun, 2021

ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముగ్గురు అరెస్ట్

November 25, 2019,   11:53 PM IST
Share on:
ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముగ్గురు అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసోం రాష్ట్రం గౌహతికి చెందిన ముఖ్దాస్ ఇస్లాం, రంజిత్ అలాలీ, లూయిస్ జమీల్ జమాల్ గా గుర్తించారు. బాంబుల తయారీలో వాడే ఐఈడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో ప్రభావితమైన ఈ ముగ్గురు ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో దాడులు జరపాలని కుట్రపన్నినట్లు సమాచారం. ఢిల్లీ ప్రత్యేక విభాగం డీసీపీ ప్రమోద్ కుష్వాహ తెలిపిన వివరాలప్రకారం …అరెస్టయిన ముగ్గురు ఐసిస్ తరహాలో దాడులకు కుట్ర పన్నారని… ఢిల్లీలోని రద్దీ ప్రాంతాల్లో …అసోంలో ని గోల్ పరా జిల్లాలో సోమవారం ఉగ్రదాడులకు సిద్ధమైనట్టు చెప్పారు. అసోం పోలీసులు, ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో వారిని ఢిల్లీలో అరెస్ట్  చేసినట్టు తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.