(Local) Sun, 16 Feb, 2020

రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ

November 25, 2019,   8:36 AM IST
Share on:
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ

రాజకీయాల్లోకి వస్తానని చిన్నతనంలో అనుకోలేదని, ఆధ్యాత్మిక మార్గంలోనే వెళ్లాలన్నది తన ఆకాంక్ష అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా తన అభిప్రాయాలను ప్రధాని పంచుకున్నారు. మన జీవన విధానం అంతా ప్రకృతితోనే ముడిపడి ఉందని.. ప్రకృతి బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని పేర్కొన్నారు. పెరుగుతున్న టెక్నాలజీ విద్యార్థులకు చేటుగా మారిందన్నారు. విజ్ఙానం కోసం పుస్తకాలు చదవడం మానేసి గూగుల్ లో వెతుకుతున్నారని అన్నారు. ఫిట్ ఇండియా విషయంలో స్కూళ్లకు ర్యాంకులు కేటాయించాలని స్పష్టం చేశారు. అయోధ్య తీర్పు సమయంలో ప్రజలు చూపిన సద్భావన హర్షణీయమన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.