(Local) Tue, 26 Oct, 2021

అన్ని రాష్ట్రల సీఎంలతో మాట్లాడిన నరేంద్ర మోడీ

August 05, 2019,   3:07 PM IST
Share on:
అన్ని రాష్ట్రల సీఎంలతో మాట్లాడిన నరేంద్ర మోడీ

ఆర్టికల్ 370రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్రహోంమంత్రి  అమిత్‌ షా స్పష్టం చేశారు. జమ్మూ-కశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయగా, లద్దాఖ్‌ను అసెంబీలేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. జమ్మూకశ్మీర్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడంతో దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సిఎంలతో నేరుగా ఫోన్ లో మాట్లాడారు. జమ్మూకశ్మీర్ అంశంపై ఆయా రాష్ట్రాల సిఎంలకు వివరించారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై మోడీ ఆరా తీశారు. బిహార్, యుపి సహా పలు రాష్ట్రాల్లో భద్రతను భారీగా పెంచారు.

సోమవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి జమ్మూకశ్మీర్ కు వెళుతారు. ఆయన అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమీక్షిస్తారు. జమ్మూకశ్మీర్ ను రెండుగా విభజించడంతో కశ్మీర్ లోయకు గగన మార్గంలో పారామిలిటరీ దళాలను తరలించారు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ లో భారీగా రక్షణ బలగాలు మోహరించాయి. పలు చోట్ల 144 సెక్షన్ విధించారు. ఇంటర్ నెట్, సెల్ ఫోన్ సేవలను నిలిపివేశారు.

సంబంధిత వర్గం
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.