(Local) Sat, 07 Dec, 2019

‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించిన మోడీ

August 29, 2019,   4:39 PM IST
Share on:
‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించిన మోడీ

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడి ‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించారు. అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడి మాట్లాడుతూ ...ఇదే రోజు ఓ గొప్ప క్రీడాకారుడైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ మన దేశంలో పుట్టారు. ఆయన తన ఫిట్‌నెస్‌తో, స్టామినాతో, హాకీ స్టిక్‌తో ప్రపంచాన్ని అబ్బురపరిచారు. ఆయనకు ధన్యవాదాలు. ఫిట్‌నెస్‌ ఆరోగ్యానికి ఎంతో అవసరం. అది ప్రతి ఒక్కరి జీవనవిధానం కావాలి. జీవితంలో వ్యాయామం, క్రీడలు ఒక భాగం కావాలి. క్రీడల్లో రాణించాలంటే శారీరక దృఢత్వం చాలా ముఖ్యం. అలా ఉంటే ఎటువంటి వ్యాధులు దరిచేరవు. దీన్ని నేటి యువతరం గుర్తించాలి. వ్యాయామం చేయాలని చెప్పడమే కాదు.. చేసి చూపించాలి. నేటి కాలంలో సాంకేతికత పెరగడం వల్ల కొద్ది దూరం కూడా నడవలేకపోతున్నారు. కనీసం 2వేల అడుగులు కూడా వేయలేని పరిస్థితి. దీంతో చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడుతున్నారు. ఫిట్‌నెస్‌ ప్రాధాన్యతపై విస్తృత చర్చ జరగాలి. ఆరోగ్య భారత్‌ కోసం అందరూ ముందుకు రావాలి అని మోడి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

సంబంధిత వర్గం
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.