(Local) Wed, 20 Oct, 2021

చికిత్స కోసం లండన్‌కు వెళ్లనున్న నవాజ్ షరీష్‌...

November 19, 2019,   7:40 PM IST
Share on:
చికిత్స కోసం లండన్‌కు వెళ్లనున్న నవాజ్ షరీష్‌...

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయన్ను లండన్ కు తరలించారు. ఎయిర్ అంబులెన్స్ లో లాహోర్ నుంచి ఆయన్ను లండన్ కు తరలించారు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు షరీఫ్ కు ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. విదేశాలకు వెళ్లేందుకు షరీఫ్ నుంచి కోర్టు రూ.700 కోట్ల ష్యూరిటీ తీసుకుంది. నాలుగు వారాల పాటే విదేశాల్లో ఉండాలని కోర్టు షరత్ విధించింది. లండన్ కు వెళ్లిన షరీఫ్ తో ఆయన తమ్ముడు షాబాజ్ షరీఫ్, వ్యక్తిగత వైద్యుడు ఉన్నారు. లండన్ వెళ్లే వరకు షరీఫ్ ఆరోగ్యం విషమించకుండా స్టెరాయిడ్లు, ఇతర ఔషధాలను ఆయన అధిక మోతాదులో ఇచ్చారు. లండన్ లోని హరేలీ స్ట్రీట్ క్లినిక్ లో ఆయనకు చికిత్స అందించనున్నారు. అవసరమైతే అమెరికాలోని బోస్టన్ నగరానికి కూడా షరీఫ్ వెళ్లేందుకు లాహోర్ కోర్టు వెసులుబాటు కలిపించింది. అవినీతి కేసులో షరీఫ్ ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

సంబంధిత వర్గం
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
పోస్టల్‌ సేవలు పునరుద్ధరించిన పాక్‌!
పోస్టల్‌ సేవలు పునరుద్ధరించిన పాక్‌!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.