(Local) Fri, 25 Sep, 2020

పోస్టల్‌ సేవలు పునరుద్ధరించిన పాక్‌!

November 19, 2019,   4:41 PM IST
Share on:
పోస్టల్‌ సేవలు పునరుద్ధరించిన పాక్‌!

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం భారత్ తో పోస్టల్ మెయిల్ సర్వీసులను నిలిపివేసి తన నిరసనను వెలిబుచ్చింది. తాజాగా ఈ విషయంలో పాక్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. పోస్టల్ మెయిల్ సర్వీసులను పునరుద్ధరించింది. ఉత్తరాల బట్వాడాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినట్లు ప్రకటించింది. అయితే, పార్శిల్ సర్వీసులపై ఉన్న నిషేధాన్ని తొలగించలేదని పేర్కొంది. కశ్మీర్ పై కేంద్రం తీసుకున్న చర్యలను నిరసిస్తూ.. పాక్ గత రెండు నెలలుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది.

ఇరు దేశాల మధ్య కుదుర్చుకున్న దౌత్య సంబంధాలను అలక్ష్యం చేస్తూ.. ఆగస్టులో పోస్టల్ మెయిల్ సర్వీసులను నిలిపివేసిన పాక్, అనంతరం, భారత విమానాలు తమ గగన తలం నుంచి ప్రయాణించకుండా పాక్షికంగా నిషేధించింది. దీంతో భారత్ పలు అంతర్జాతీయ వేదికలపై పాక్ అనుసరిస్తున్న వైఖరిని విమర్శించింది. తమదేశం పట్ల పాక్ తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమేనంటూ పేర్కొంది. ఫలితంగా పాక్ అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి తన నిర్ణయాలను క్రమంగా మార్చుకుంటోందని తెలుస్తోంది. భారత్ తో పోస్టల్ సేవల పునరుద్ధరణ ఈ నేపథ్యంలో తొలి అడుగు అని విశ్లేషకులు అంటున్నారు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.