(Local) Thu, 29 Jul, 2021

పాకిస్థాన్‌ అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు

August 14, 2019,   6:37 PM IST
Share on:
పాకిస్థాన్‌ అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ  ఈరోజు పాకిస్థాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌ను ఎదుర్కోవాలంటే జీహాదీ ఒక్కటే మార్గమని సంచలన వ్యాఖ్యలు చేసారు. బాధ్యతాయుత పదవిలో ఉంటూ ఆయన నోరు పారేసుకోవడంపై ప్రస్తుతం దుమారం చెలరేగుతోంది. కాశ్మీరు అంశంలో మిత్ర దేశం చైనా కూడా పాకిస్థాన్‌కు బాసటగా నిలవక పోవడంతో దాయాది దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ స్థితిలో మరింత బాధ్యతాయుతంగా ఉండి ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుకోసం ప్రయత్నించాల్సిన ఆ దేశ అధ్యక్షుడు  ఆరిఫ్‌ అల్వీ తానే స్వయంగా జీహాదికి పిలుపునివ్వడంపై విమర్శకులు మండిపడుతున్నారు. కాగా, ఆరిఫ్‌ వ్యాఖ్యల నేపధ్యంలో భారత్‌ కశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేసింది. దాయాది అడుగులను డేగ కళ్లతో గమనిస్తోంది.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.