(Local) Mon, 18 Nov, 2019

దేశభక్తిని వినూత్నంగా చాటిన ఎన్ఆర్ఐ

August 29, 2019,   1:16 PM IST
Share on:
దేశభక్తిని వినూత్నంగా చాటిన ఎన్ఆర్ఐ

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో, అందులో అంతర్భాగమైన ఆర్టికల్ 35ఏ కూడా రద్దైపోయింది. ఈ కీలక పరిణామం నేపథ్యంలో ఫిలిప్పీన్స్ లో రెస్టారెంట్ ను నిర్వహిస్తున్న భారత సంతతికి చెందిన  మైక్ దేవ్నాన్ని తన దేశ భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. మదరిండియా పేరుతో ఉన్న తన రెస్టారెంటులో రెండు బీర్లకు ఆర్టికల్ 370, ఆర్టీకల్ 35ఏ అనే పేర్లను పెట్టారు.ఈ సందర్భంగా దేవ్నానీ మాట్లాడుతూ ప్రచారం కోసమో, వివాదం కోసమో తాను ఈ పేర్లు పెట్టలేదని చెప్పారు. బీర్లపై ఉన్న పేర్లను చూడగానే కస్టమర్లు దాని గురించి అడుగుతారని… అప్పుడు మన దేశ ఔన్నత్యం గురించి వారికి వివరించవచ్చని తెలిపారు.

20 ఏళ్ల వయసులో ఫిలిప్పీన్స్ కు వెళ్లిన దేవ్నానీ… అప్పటి నుంచి భారత్ కు తిరిగి రాలేదు. ఇండియన్ పాస్ పోర్టును గుర్తుగా ఇప్పటికీ తన వద్దే ఉంచుకున్నారు. భారత్ తనకు బంధువులు ఎవరూ లేరని… అందుకే ఇండియాకు రావాల్సిన అవసరం తనకు రాలేదని చెప్పారు.

సంబంధిత వర్గం
ఆర్టిక‌ల్ 370 ని తెరకెక్కిస్తున్న దర్శకుడు....
ఆర్టిక‌ల్ 370 ని తెరకెక్కిస్తున్న దర్శకుడు....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.