(Local) Sat, 27 Feb, 2021

ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు..

October 22, 2019,   1:50 PM IST
Share on:
ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ...

అసోం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని ప్రకటించింది. 2021 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల్లో ఇద్దరు పిల్లల నిబంధనకు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం 2017లోనే ఆమోదం పొందింది. అయితే, నిబంధనను 2021 నుంచి అమలు చేయాలని తాజాగా కేబినెట్ నిర్ణయించింది. జనాభా నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, బస్సు ఛార్జీలను 25 శాతం పెంచాలనే నిర్ణయాన్ని కూడా కేబినెట్ తీసుకుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.