(Local) Wed, 24 Jul, 2019

పన్నుల విధానంలో పారదర్శకత తీసుకువస్తాం - నిర్మల సీతారామన్

July 05, 2019,   1:18 PM IST
Share on:

పన్ను చెల్లింపుదారుల వల్లే దేశం నడుస్తోందని, పన్నులతో ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన  సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడారు. ప్రత్యక్ష పన్నుల ఆదాయం 78 శాతం పెరిగిందన్నారు. 2018-19లో 11.37 లక్షల కోట్లకు ఆదాయం పెరిగిందని, పన్నుల విధానంలో పారదర్శకత తీసుకొస్తామని, కార్పొరేట్ ట్యాక్స్ పరిధి రూ.400 కోట్లకు పెంచామన్నారు.  సంవత్సరంలో ఆదాయం ఐదు లక్షల రూపాయలలోపు  ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇకపై ఆధార్ కార్డు ఆధారంగా కూడా రిటర్న్ ఫైలింగ్ చేస్తామని, ఆదాయ పన్ను రిటర్న్‌లో కొత్త విధానం తీసుకోస్తామని, నగదు విత్ డ్రాయల్ కోటి రూపాయలు దాటితే ఇకపై పన్ను విదిస్తామని, రూ. కోటి దాటిన నగదును విత్ డ్రాయల్‌పై 2 శాతం టిడిఎస్ ఉంటుందని తెలియజేశారు.  రుణ సంక్షోభం నుంచి ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఊరట కలిగించారు. ఇష్టానుసారంగా నగదు వాడకం నియంత్రణకు ప్రత్యేక విధానం ఏర్పాటు చేశారు. రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 విలువతో కొత్త నాణెలు విడుదల.  దేశంలో మెగా మ్యాన్యూఫ్యాక్చరింగ్ జోన్లను ఏర్పాటు చేశామని, బ్యాటరీలు, సౌరశక్తి రంగంలో విదేశీ కంపెనీలకు అనుమతి ఇస్తామని చెప్పారు. రూ.400 కోట్ల లోపు వార్షికాదాయం ఉన్న కంపెనీలకు 25 శాతం పన్ను పరిధిలోకి తీసుకోస్తామని వెల్లడించారు. 200 కోట్లు లోపు వార్షిక ఆదాయం ఉన్న కంపెనీలకు దిగువ కార్పొరేట్ ట్యాక్స్ విధిస్తామని చెప్పారు. ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ పై ఒక రూపాయ సుంకం పెంచడంతో ధరలు పెరగనున్నాయి. కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.5 శాతానికి పెంచడంతో బంగారు అభరణాల ధరలు పెరుగుతాయి. 

 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.