(Local) Tue, 19 Oct, 2021

రివ్యూ: అర్జున్ సుర‌వరం

November 29, 2019,   3:48 PM IST
Share on:
రివ్యూ: అర్జున్ సుర‌వరం

రీమేక్ ట్రెండ్ తెలుగులో కొత్తేమీకాదు. భిన్న భాషల్లో విజయవంతమైన పలు చిత్రాలు తెలుగులో పునర్నిర్మనమై పెద్ద విజయాల్ని అందుకున్న సందర్భాలున్నాయి. అర్జున్ సురవరంతో హీరో నిఖిల్ అలాంటి ప్రయత్నమే చేశారు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చిత్రం ‘క‌ణిత‌న్‌’. చాలా మంది తెలుగు క‌థానాయ‌కులు ఈ సినిమాపై ఆస‌క్తి ప్రద‌ర్శించారు. ఆ అవ‌కాశం నిఖిల్‌కి ద‌క్కింది.  కానీ కొన్ని కార‌ణాల‌వ‌ల్ల చిత్రం విడుద‌ల కావ‌డంలో ఆల‌స్యమైంది. నిఖిల్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా టి.సంతోష్ దర్శకత్వం వహించిన సినిమా ‘అర్జున్ సురవరం’. ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ : అర్జ‌న్ లెనిన్ సుర‌వ‌రం (నిఖిల్‌) టీవీ 99లో ప‌నిచేస్తుంటాడు. తండ్రి (నాగినీడు) కి ఈ విష‌యం తెలీదు. త‌న కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ అనే భ్ర‌మ‌ల్లో ఉంటాడా తండ్రి.  బీబీసీలో ఉద్యోగాన్ని సంపాదించాలన్నది అతడి కల. అర్జున్ ప్రతిభను గుర్తించిన బీబీసీ సంస్థ అతడికి ఉద్యోగాన్ని ఇస్తుంది. కావ్య (లావణ్య త్రిపాఠి)తో పరిచయం.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అయితే రిస్క్ చేసి మరి సెన్సేషనల్ న్యూస్ ను బ్రేక్ చేసే అర్జున్ లైఫే, బ్రేకింగ్ న్యూస్ అవుతోంది. తనకు తెలియకుండానే అర్జున్ అనూహ్యంగా ఓ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు నుండి బయటపడటానికి చేసే ప్రయత్నాల క్రమంలో ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేసే మాఫియా గురించి.. అలాగే తను ఈ పరిస్థితికి రావడానికి కారణం కూడా వాళ్లే అని తెలుసుకుంటాడు. ఎలాగైనా ఆ చీక‌టి కోణాన్ని బ‌య‌ట పెట్టేందుకు న‌డుం బిగిస్తాడు. స్వత‌హాగా పాత్రికేయుడైన అర్జున్ త‌నకున్న తెలివితేట‌ల‌తో స‌ర్టిఫికెట్ల మాఫియా బండారాన్ని ఎలా బ‌య‌ట పెట్టాడ‌నేదే మిగ‌తా సినిమా. 

ప్లస్ పాయింట్స్ : నిఖిల్ అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. పాత్రికేయుడి పాత్రకు త‌గ్గట్టుగా చ‌క్కగా న‌టించాడు. యాక్షన్ స‌న్నివేశాలు కూడా చాలా బాగా చేశాడు. కావ్య అనే యువ‌తి పాత్రలో లావ‌ణ్య త్రిపాఠి ప‌రిధి మేర‌కు న‌టించింది. హీరో స్నేహితుడిగా, లాయర్‌గా వెన్నెల కిషోర్‌ మరోసారి హాస్యాన్ని పంచాడు. విలన్‌ పాత్రలో తరుణ్‌ అరోరా ఆకట్టుకోగా, పోసాని కృష్ణమురళి, నాగినీడు, విద్యుల్లేఖ, ఇతర నటులు తమ పరిధమేరకు ఆకట్టుకున్నారు.మొత్తమ్మీద ఎంటర్టైన్మెంట్ తో దొంగ సర్టిఫికెట్స్ దందాకి సంబంధించిన సీన్స్ తో ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇంటర్వెట్ ముందు కథ కొంచెం వేగంగా సాగుతూ సెకెండాఫ్ మీద కొంత ఇంట్రస్ట్ పెంచుతుంది.

మైనస్ పాయింట్స్ : మొదటి అర్ధభాగం ఇంట్రస్టింగ్‌ కథనంతో వరుస ట్విస్టులతో దర్శకుడు వేగంగా నడిపాడు. సెకండాఫ్ కాస్త స్లో అనిపిస్తుంది.ఫైట్లు, ఛేజింగ్‌లతో అక్కడక్కడ ఓవర్‌ సినిమాటిక్‌గా అనిపిస్తుంది.క్లైమాక్స్ కూడా కాస్త హడావిడిగా ముగిసినట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం శ్రద్ద వహించి ఉంటే సినిమా రేంజ్ మరో స్థాయికి వెళ్లేది. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో చాలానే మార్పుచేర్పులు చేశాడు కానీ తమిళంలో ఉన్న ఫీల్ ఇక్కడ మిస్ అయ్యిందనే చెప్పాలి.

సాంకేతిక విభాగం : తమిళ రీమేక్‌ అయిన ఆ భావన రాకుండా పూర్తి తెలుగు నేటివిటీతో అర్జున్‌ సురవరంను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. పాటలు అంతంతమాత్రం ఉండగా.. నేపథ్య సంగీతం చాలావరకు రణగొణ ధ్వనులతో సీన్లకు సంబంధం లేనట్టుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువులు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.

తీర్పు : కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం సరదాగా ఒకసారి చూడదగిన చిత్రం “అర్జున్ సురవరం”.

రేటింగ్: 2.5/5

సంబంధిత వర్గం
నిఖిల్‌ కోసం వస్తున్న మెగాస్టార్...
నిఖిల్‌ కోసం వస్తున్న మెగాస్టార్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.