
ఇక పై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జేబులు గుల్ల కావాల్సిందే. పార్లమెంట్ ఇటీవలే కొత్త వాహన చట్టాన్ని ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా లభించింది. న్యాయశాఖ నిబంధనలు రూపొందించడమే మిగిలింది. న్యాయశాఖ నిబంధనలు అవసరం లేని 63 క్లాజులను సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. గడ్కరీ ప్రకటన నేపథ్యంలో కొత్త మోటారు వాహన చట్టంపై రాష్ట్రంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు అప్పుడే మొదలయ్యాయి. ‘ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. డబ్బులు మిగుల్చుకోండి’ అంటూ హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు చౌరస్తాల్లో బోర్డులు పెట్టి మరీ పాజిటివ్ ప్రచారం చేస్తున్నారు. కేంద్ర చట్టాన్ని రాష్ట్రం అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుందని దానికి పెద్ద సమయం పట్టదని తెలంగాణ న్యాయశాఖ అధికారులు తెలిపారు. నూతన చట్టాన్ని కేంద్రం అమలు చేసిన రోజునే రాష్ట్రంలో కూడా అమలులోకి వస్తుందని వారు అన్నారు. ప్రస్తుతం ఉన్న జరిమానాలకు దాదాపు 10 శాతం రెట్టింపు జరిమానాను పెంచారు.
కొత్తగా వచ్చిన ట్రాఫిక్ నిబంధనలు ఈ విధంగా ఉండనున్నాయి.
- ప్రస్తుతం సీటు బెల్ట్ ధరించకపోతే 100 రూపాయల ఫైన్ ఉండగా ఇక నుంచి అది 1000 రూపాయలు కానుంది.
- ప్రస్తుతం హెల్మెట్ ధరించకపోతే 100 రూపాయల ఫైన్ ఉండగా ఇక నుంచి అది 1000 రూపాయలు కానుంది.
- అంబులెన్స్ లు, అత్యవసర వాహనాలకు దారివ్వకపోతే ప్రస్తుతం ఎటువంటి ఫైన్ లేదు. కానీ ఇక నుంచి 10 వేల రూపాయల ఫైన్ విధించనున్నారు.
- వాహనాలను అతివేగంగా నడిపిన, బైక్ రేసింగ్ లకు పాల్పడితే ప్రస్తుతం 500 రూపాయల ఫైన్ విధిస్తున్నారు. ఇక నుంచి 5000 రూపాయల ఫైన్ విధిస్తారు.
- లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ప్రస్తుతం 500 రూపాయల ఫైన్ విధిస్తున్నారు. ఇక నుంచి 5000 రూపాయలు విధించనున్నారు.
- డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనం నడిపితే ప్రస్తుతం 2 వేల రూపాయల ఫైన్ విధిస్తున్నారు. ఇక నుంచి 10 వేల రూపాయల ఫైన్ విధించనున్నారు.
- ఓవర్ లోడ్ తో వెళ్లే వాహనాలకు ప్రస్తుతం 2 వేల రూపాయల ఫైన్ విధిస్తున్నారు. ఇక నుంచి 20 వేల రూపాయల ఫైన్ విధించనున్నారు.
- మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ప్రస్తుతం ఎటువంటి ఫైన్ లేదు. కానీ ఇక నుంచి 25 వేల రూపాయలు ఫైన్ విధించనున్నారు.
- ట్రాఫిక్ లైన్ జంప్ చేసినా, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేసినా, రాంగ్ రూట్ లో ఓవర్ లోడ్ తో వెళ్లినా ప్రస్తుతం 1000 రూపాయల ఫైన్ విధిస్తున్నారు. ఇక నుంచి 5 వేల రూపాయల ఫైన్ విధించనున్నారు.
-
‘దారి తప్పిన’ బస్సుకు ఎదురునిలిచింది
27 Sep 2019, 3:40 PM
-
ట్రక్కు ఆపరేటర్‌కు భారీ జరిమానా
15 Sep 2019, 1:23 PM
-
బెంగుళూరులో రికార్డు స్థాయిలో జరిమానాలు వసూలు
14 Sep 2019, 10:34 AM
-
లారీ డ్రైవర్లు లుంగీతో డ్రైవింగ్ చేస్తే రూ.2000 వే ...
09 Sep 2019, 12:50 PM
-
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే పోలీసులకు భారీ జరిమానా
07 Sep 2019, 12:25 PM
-
ట్రాఫిక్ ఉల్లంఘనలపై రాజస్థాన్ పోలీసులు మరో ముందడుగ ...
06 Sep 2019, 3:26 PM
-
కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇంకాస్త లేట్
05 Sep 2019, 12:01 PM
-
త్వరలో పేటీఎం లైవ్ టీవీ
16 Aug 2019, 4:36 PM
-
పూర్తి స్థాయి బడ్జెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
11 Aug 2019, 6:13 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

‘దారి తప్పిన’ బస్సుకు ఎదురునిలిచింది

త్వరలో పేటీఎం లైవ్ టీవీ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.