(Local) Mon, 23 Nov, 2020

చంద్ర బిలాలను చిత్రీకరించిన ఆర్బిటర్ కెమెరా

August 27, 2019,   12:53 PM IST
Share on:
చంద్ర బిలాలను చిత్రీకరించిన ఆర్బిటర్ కెమెరా

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2 అప్పుడే చంద్రునిలోని అనేక విశేషాలను భూమికిచేర వేస్తోంది. మరికొద్దిరోజుల్లోనే చంద్రుని పై రోవర్‌ కాలుమోపనుంది. తాజాగా కక్ష్యలో పరిభ్రమిస్తున్న మాడ్యూల్‌ అత్యంత విలువైన సమాచారాన్నిచేరవేసింది. ఆర్బిటర్‌ కెమెరా చంద్రబిలాలను చిత్రీకరించింది. ఈనెల 23వ తేదీ రాత్రి 7.42 గంటలకు చంద్రునికి 4375 కిలోమీటర్ల ఎత్తు నుచిఇ ఆర్బిటర్‌లోని టెర్రియన్‌ మ్యాపింగ్‌ కెమెరా-2 ఈ బిలాలను చిత్రీకరించి పంపినట్టు ఇస్రో సోమవారం వెల్లడించింది. చంద్రుని ఉత్తరార్ధ గోళంలోని జాక్సన్‌మాక్‌ , మిత్ర, కొరోలివే వంటి బిలాల ఛాయా చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. అలాగే చంద్రుని పై సౌర మచ్చల చిత్రాలను కూడా ఇస్రో విడుదల చేసింది.

సంబంధిత వర్గం
చంద్రయాన్ 2 గురించి గుడ్‌న్యూస్ చెప్పిన ఇస్రో చీఫ్ ...
చంద్రయాన్ 2 గురించి గుడ్‌న్యూస్ చెప్పిన ఇస్రో చీఫ్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.