
మేజర్ ధ్యాన్ చంద్ భారత దిగ్గజ హాకీ ప్లేయర్. మైదానంలో హాకీ స్టిక్‌తో మెరుపులు చిందించి భారత దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేశాడు. తన ఆటతో ప్రత్యర్థులను చిత్తు చేసి భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చాడు. ఆ హాకీ మాంత్రికుడే భారతదేశంలో క్రీడా దినోత్సవ సృష్టికర్త అయ్యాడు.భారత దిగ్గజ హాకీ ప్లేయర్ ధ్యాన్‌చంద్ పుట్టినరోజును ప్రతి ఏటా ఆగష్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ ఏడాది క్రీడా దినోత్సవానికి పీవీ సింధు, హిమదాస్‌లు దేశానికి అందించిన స్వర్ణ పతకాలే కానుకలయ్యాయి.
1905 ఆగస్టు 29న ధ్యాన్‌చంద్ ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించాడు. భారతీయ హాకీ చరిత్రలో గొప్ప ఆటగాడిగా ధ్యాన్‌చంద్ గుర్తింపు పొందాడు. ధ్యాన్‌చంద్ 1928, 1932, 1936 సంవత్సరాల్లో మూడు ఒలంపిక్ బంగారు పతకాలను భారత్‌కు అందించాడు. తన అంతర్జాతీయ హాకీ కేరీర్లో 400కుపైగా గోల్స్‌ను నమోదు చేశాడు. క్రీడా రంగంలో ధ్యాన్‌చంద్ చేసిన కృషికి ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది.
ధ్యాన్‌చంద్ వేసిన బాటలో ఎందరో భారత క్రీడాకారులు సాగుతున్నారు. నాటి మిల్కా సింగ్ నుంచి నేటి పీవీ సింధు వరకూ ఎందరో క్రీడా రంగంలో అగ్ర పథాన నిలుస్తున్నారు. స్వర్ణ పతకాల వేటలో క్రీడా అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తున్నారు. భారత మాజీ ట్రాక్ అండ్ ఫీల్డ్ స్ప్రింటర్ మిల్కాసింగ్ కామన్వెల్త్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. పీటీ ఉష పరుగుల పోటీల్లో నాలుగు స్వర్ణాలను, ఒక కాంస్య పతాకాన్ని భారత్‌కు సాధించి పరుగుల రాణిగా గుర్తింపు పొందింది. ఆ విజయ ప్రస్థానాన్ని ఆ తర్వాత వచ్చిన క్రీడాకారులు కొనసాగించారు. ఆట ఏదైనా గెలుపు మనదే అన్నట్టుగా క్రీడారంగంలో సరికొత్త రికార్డులను నమోదు చేసుకున్నారు. సచిన్ టెండూల్కర్, లియాండర్ పేస్, విశ్వనాథన్ ఆనంద్, అభినవ్ బింద్రా, మెరీకోమ్, సుశీల్ కుమార్, హిమదాస్ ఇలా ఎంతో మంది తమ రంగాల్లో రాణించి భారత దేశ ఖ్యాతిని మరింత పెంచారు. క్రీడలకు, క్రీడాకారులకు ప్రభుత్వం మరింత చేయూతనిస్తే మరెంతోమంది క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతారు. దేశానికే గర్వకారణంగా మారుతారు. నేడు భారత జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలుగు డైలీ 24 తరపున అందరికి క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు.
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.