(Local) Wed, 24 Jul, 2019

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీలాల్ వోరా

July 03, 2019,   11:21 PM IST
Share on:

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ కురువృద్ధుడు మోతీలాల్ వోరాను నియమించారు. కొద్దిరోజులుగా రాహుల్ గాంధీ రాజీనామాపై నెలకొన్న సందిగ్ధతకు నేడు తెరపడింది. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ చీఫ్‌గా కొనసాగలేనని స్పష్టం చేస్తూ రాహుల్ రాజీనామా త‌ర్వాత‌ లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే వరకు ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న 90ఏండ్ల వోరా ఆ పదవిలో కొనసాగనున్నారు. వోరా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. పార్టీ అన్ని ప్రధాన విధాన నిర్ణయాల్లో ఆయన పాల్గొన్నారు. గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఆయన నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రాహుల్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.