(Local) Wed, 23 Sep, 2020

మోదీని కీర్తిస్తున్న కాంగ్రెస్ నేతలను పార్టీ నుండి తరిమికొట్టండి -కేకే తివారీ

August 26, 2019,   3:32 PM IST
Share on:
మోదీని కీర్తిస్తున్న కాంగ్రెస్ నేతలను పార్టీ నుండి ...

దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దెయ్యాల రాజ్యంగా మారుస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కేకే తివారీ ధ్వజమెత్తారు. అంతే కాకుండా మోదీని కీర్తిస్తున్న కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి తరిమికొట్టాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీని విమర్శించటం కాంగ్రెస్‌కు అంత మంచిది కాదని కాంగ్రెస్ నేతలు శశి థరూర్, జైరాం రమేష్, అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించటాన్ని తప్పు పట్టారు.‘మోదీని పొగుడుతున్న కాంగ్రెస్ నేతలను బయటికి తరిమి కొట్టాలని పార్టీ అధినేత సోనియాగాంధీకి విజ్ఞప్తి చేస్తాను. ప్రధాని మెజారిటీ వాదాన్ని పట్టుకొని ఫాసిజాన్ని రెచ్చ గొడు తున్నారు. పుట్టుకతో ఎవరూ దెయ్యం కాదు, దేవదూత కాదు. అయితే అది వారి చర్యలమీద ఆధారపడి ఉంటుంది. మోదీ. అందరిలాగే పుట్టిన ప్పటికీ, ఆయన చర్యలు ఈ దేశాన్ని దెయ్యాల రాజ్యంగా మారుస్తున్నాయి’ అని కేకే తివారీ ఆదివారం ఇక్కడ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మండిపడ్డారు

సంబంధిత వర్గం
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.