(Local) Fri, 22 Nov, 2019

కాశ్మీర్ డెవలప్ మెంట్ పై ప్రత్యేక కమిటీ

August 28, 2019,   3:27 PM IST
Share on:
కాశ్మీర్ డెవలప్ మెంట్  పై ప్రత్యేక కమిటీ

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక చొరవ చూపిస్తుంది. అక్కడ ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి, పరిశ్రమలను తెచ్చి యువతకు ఉపాధి కల్పించేందుకు కంకణం కట్టుకుంది. దానిలో భాగంగానే కాశ్మీర్ డెవలప్ మెంట్ పై మంత్రులతో కూడిన స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కేంద్రమత్రులు రవిశంకర్ ప్రసాద్, థావర్ సింగ్ గెహ్లట్, జితేందర్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్, ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు. కాశ్మీర్ అభివృద్ధిపై అక్టోబర్ 31వరకు సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్రం పేర్కొంది. నివేదిక ఆధారంగా కాశ్మీర్ కు మరో ఆర్థిక ప్యాకేజీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వర్గం
జమ్మూకశ్మీర్‌లో పేలుడు పదార్థాల కలకలం
జమ్మూకశ్మీర్‌లో పేలుడు పదార్థాల కలకలం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.