(Local) Sun, 20 Sep, 2020

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

August 21, 2019,   12:37 PM IST
Share on:
మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్‌ గౌర్‌ (89) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాబూలాల్‌గౌర్‌ భోపాల్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.2004 ఆగస్ట్ 23 నుంచి 2005 నవంబర్ 29వరకు మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేశారు. బాబూలాల్ గౌర్ మృతికి ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం తెలిపారు.

బాబూలాల్ గౌర్.. గోవింద పురం విధాన సభకు 10సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1930 జూన్‌ 2న ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జన్మించారు. తర్వాత మధ్యప్రదేశ్‌కు వచ్చి పలుకుబడి ఉన్న నేతగా ఎదిగారు. ఆర్ ఎస్ ఎస్, జన్ సంఘ్ ల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడిగా, ఎమ్మెల్యేగా పలు పదవుల్లో పనిచేశారు. మధ్యప్రదేశ్‌ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. 

ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో అరెస్టై జైలుకెళ్లారు. 2003లో మధ్యప్రదేశ్ లో ఉమాభారతి ప్రభుత్వం ఏర్పడ్డాక… ఆమె కేబినెట్ లో పట్టణాభివృద్ధి, న్యాయ శాఖ, హౌసింగ్, పర్యావరణం, కార్మిక శాఖలు నిర్వహించారు. ఉమాభారతి సీఎం పదవికి చేసిన రాజీనామా తర్వాత బాబూలాల్ గౌర్ సీఎం అయ్యారు. ఏడాది పాటు ఆయన పదవిలో కొనసాగారు. ఏడాది 98 రోజుల పాటు సీఎంగా పనిచేశారు. తర్వాత శివరాజ్ సింగ్ సీఎం అయ్యాక.. ఆయన కేబినెట్ లో అనేక శాఖలకు బాబూలాల్ గౌర్ మంత్రిగా పనిచేశారు.

సంబంధిత వర్గం
బోరున విలపించిన కర్ణాటక మాజీ సీఎం
బోరున విలపించిన కర్ణాటక మాజీ సీఎం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.