(Local) Thu, 29 Jul, 2021

అరుణ్‌ జైట్లీని పరామర్శించిన అడ్వాణీ

August 19, 2019,   3:23 PM IST
Share on:
అరుణ్‌ జైట్లీని పరామర్శించిన అడ్వాణీ

బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని పరామర్శించారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి చేరుకొని జైట్లీని పరామర్శించారు. అరుణ్‌ జైట్లీ ఆరోగ్యం విషమించడంతో ఆయనను ప్రాణాధార వ్యవస్థపై ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు ఆస్పత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఆరా తీస్తున్నారు. శ్వాస సంబంధ ఇబ్బంది రావడంతో అరుణ్‌ జైట్లీని ఈ నెల 9న కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌లో చేర్పించిన విషయం తెలిసిందే.

సంబంధిత వర్గం
తీవ్రమైన కడుపునొప్పితో ఎయిమ్స్ లో చేరిన చిదంబరం
తీవ్రమైన కడుపునొప్పితో ఎయిమ్స్ లో చేరిన చిదంబరం
అత్యంత విషమంగా జెట్లీ ఆరోగ్యం ..
అత్యంత విషమంగా జెట్లీ ఆరోగ్యం ..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.