(Local) Sun, 27 Sep, 2020

జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజనకు నిరసనగా లండన్‌లో ఆందోళన

August 16, 2019,   4:44 PM IST
Share on:
జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజనకు నిరసనగా  లండన్‌లో  ఆం ...

370 రద్దుపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఈ రోజు రహస్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో వేలాది కశ్మీరీలు ప్లకార్డులు, బ్యానర్లతో భారత హైకమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. పాకిస్తాన్ జెండాలు, కశ్మీరీ జెండాలు ప్రదర్శిస్తూ.. భారత్ నుంచి తమకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. మోదీని హిట్లర్ తో పోలుస్తూ నినాదాలు చేశారు.  భారత ఆక్రమణను ఐరాస అడ్డుకోవాలని కోరారు. కశ్మీర్‌లోని తమ కుటుంబ సభ్యులు ఎంతో వేదన అనుభవిస్తున్నారని, వారితో కనీసం ఫోన్లోనూ మాట్లాడలేకపోతున్నానని సుమైయా షా అనే మహిళ చెప్పింది. భారత ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని బందిఖానాగా మార్చిందని ఆరోపించింది. ఆందోళనకారులను అక్కడిన నుంచి పంపించేందుకు పోలీసులు యత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు పొగ బాంబులు విసిరారు. నలుగురిని అరెస్ట్ చేశారు. 

సంబంధిత వర్గం
వరుస విజయాల కోహ్లి సేన...
వరుస విజయాల కోహ్లి సేన...
దేశ ప్రజలకు టీమిండియా స్వాతంత్య్ర  దినోత్సవ శుభాకా ...
దేశ ప్రజలకు టీమిండియా స్వాతంత్య్ర  దినోత్సవ శుభాకా ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.