(Local) Wed, 21 Aug, 2019

రెండో వన్డే లో భారత్ గ్రాండ్ విక్టరీ..

August 12, 2019,   10:08 AM IST
Share on:

క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించింది . మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాలో  ... కెప్టెన్ కోహ్లీ దుమ్ముదులపాగా .. బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ తన  మార్క్ బౌలింగ్‌తో వెస్టిండీస్ ఆటగాళ్లను కట్టడి చేయడంతో 59 పరుగుల తేడాతో ఇండియా విక్టరీ కొట్టింది. వర్షం కారణంగా మ్యాచ్‌కి అంతరాయం కలగడంతో డక్‌ వర్త్ లుయీస్ పద్ధతిలో టీమిండియా... వెస్టిండీస్‌పై 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 120 పరుగులతో చెలరేగిపోయాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 71 పరుగులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. టార్గెట్ చేధించేదుకు విండీస్ గట్టిగానే ప్రయత్నించినా వర్షం వల్ల ఆట ముందుకు సాగలేదు. మ్యాచ్ వాయిదా పడటంతో లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270 పరుగులకు తగ్గించారు. ఈ దశలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయి వెస్టిండీస్ జట్టును కట్టడి చేశారు.. 42 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌట్ అయ్యింది విండీస్ జట్టు. దీంతో 59 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత జట్టు. విరాట్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు దక్కంది. ఇక మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది. 

సంబంధిత వర్గం

బీచ్ లో సందడి చేసిన టీమిండియా

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.