(Local) Wed, 20 Oct, 2021

బెల్లీ డ్యాన్సర్లతో పెట్టుబడిదారులకు వల వేస్తున్న పాకిస్థాన్

September 09, 2019,   1:08 PM IST
Share on:
బెల్లీ డ్యాన్సర్లతో పెట్టుబడిదారులకు వల వేస్తున్న  ...

తీవ్ర ఆర్థిక సమస్యలతో అతలాకుతలమవుతున్న పాకిస్తాన్ ... పెట్టుబడుల కోసం దిగజారి ప్రవర్తిస్తోంది. బెల్లీ డ్యాన్సర్ల చేత పెట్టుబడిదారులకు కనువిందు చేయించి... వారిని బుట్టలో వేసుకునేందుకు యత్నిస్తోంది. ప్రభుత్వ దిగజారుడుతనంపై ఆ దేశ ప్రజలే విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఓ వైపు ఇండియా చంద్రయాన్-2 ప్రయోగంలో బిజీగా ఉంటే... పాక్ మాత్రం బెల్లీ మిషన్ ను సమర్థవంతంగా నిర్వహించిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు పాకిస్థాన్ కొత్త మార్గాన్ని కనుగొందని విమర్శిస్తున్నారు.

సంబంధిత వర్గం
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.