
51 సంవత్సరాల క్రితం హిమాచల్ ప్రదేశ్ లో అదృశ్యమైన భారత వాయుసేన విమానం శకలాలు తాజాగా లభ్యమయ్యాయి.1968, ఫిబ్రవరి 7న 98 మంది రక్షణ శాఖ సిబ్బందితో లాహుల్ స్పితి జిల్లాలో ఉన్న ఢాకా గ్లేసియర్ లో ఏఎన్12, బీఎస్534 విమానం అదృశ్యమైంది. ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, లేహ్ ఎయిర్ పోర్టుకు చేరలేకపోయిన విమానం, వెనక్కు తిరిగి చండీగఢ్ కు వెళుతూ, రోహ్తంగ్ పాస్ వద్ద అదృశ్యమైంది. విమానం కోసం ఎన్నో రోజుల పాటు విస్తృతంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఆపై 2003లో హిమాలయన్ మౌటనీరింగ్ ఇనిస్టిట్యూట్ సభ్యులు, విమానంలో ప్రయాణించి, ప్రాణాలు కోల్పోయిన జవాను బేలీరామ్ మృతదేహాన్ని ఓ ప్రాంతంలో గుర్తించారు.
దీంతో తిరిగి విమానం కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. మరికొన్ని మృతదేహాలు అదే ప్రాంతంలో కనిపించాయి. ఆపై 2009లో గాలింపును పూర్తిగా నిలిపివేశారు. ఇటీవల ఢాకా గ్లేసియర్ లో కొన్ని శకలాలు కనిపించడంతో, మళ్లీ గాలింపు చర్యలు చేపట్టగా, నిన్న పలు ప్రధాన భాగాలు లభ్యమయ్యాయి. ఇంజిన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఆయిల్ ట్యాంక్, కాక్ పిట్ డోర్ వంటివి కనిపించాయి. భారత వాయుసేన చరిత్రలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదాల్లో ఒకటిగా ఈ విమానం అదృశ్యాన్ని అభివర్ణిస్తారు.
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

ఉన్నతాధికారులు ప్రయాణించే విమానాలకు ఐఎఎఫ్ పైలెట్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.