సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన మోటారు వాహనాల చట్టం

నూతన మోటారు వాహనాల చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నూతన మోటారు వాహనాల సవరణ చట్టం 2019 ని రూపొందించారు. ముందుగా 28 నిబంధనలను సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనున్నారు. మరికొన్నింటిని ముసాయిదా రూపొందించి, ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత అమలు చేయనున్నారు. ఈ నూతన చట్టంలో మరో కీలక నిబంధనను చేర్చారు. ద్విచక్రవాహనం పై వెళ్లే 4 ఏళ్లలోపు పిల్లలు కూడా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. ఈ నిబంధనని పాటించని వారి పై రూ. 500 నుంచి రూ. 10 వేల రూపాయల వరకు ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు.
కొత్తగా వచ్చిన ట్రాఫిక్ నిబంధనలు ఈ విధంగా ఉండనున్నాయి.
- ప్రస్తుతం సీటు బెల్ట్ ధరించకపోతే 100 రూపాయల ఫైన్ ఉండగా ఇక నుంచి అది 1000 రూపాయలు కానుంది.
- ప్రస్తుతం హెల్మెట్ ధరించకపోతే 100 రూపాయల ఫైన్ ఉండగా ఇక నుంచి అది 1000 రూపాయలు కానుంది.
- అంబులెన్స్ లు, అత్యవసర వాహనాలకు దారివ్వకపోతే ప్రస్తుతం ఎటువంటి ఫైన్ లేదు. కానీ ఇక నుంచి 10 వేల రూపాయల ఫైన్ విధించనున్నారు.
- వాహనాలను అతివేగంగా నడిపిన, బైక్ రేసింగ్ లకు పాల్పడితే ప్రస్తుతం 500 రూపాయల ఫైన్ విధిస్తున్నారు. ఇక నుంచి 5000 రూపాయల ఫైన్ విధిస్తారు.
- లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ప్రస్తుతం 500 రూపాయల ఫైన్ విధిస్తున్నారు. ఇక నుంచి 5000 రూపాయలు విధించనున్నారు.
- డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనం నడిపితే ప్రస్తుతం 2 వేల రూపాయల ఫైన్ విధిస్తున్నారు. ఇక నుంచి 10 వేల రూపాయల ఫైన్ విధించనున్నారు.
- ఓవర్ లోడ్ తో వెళ్లే వాహనాలకు ప్రస్తుతం 2 వేల రూపాయల ఫైన్ విధిస్తున్నారు. ఇక నుంచి 20 వేల రూపాయల ఫైన్ విధించనున్నారు.
- మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ప్రస్తుతం ఎటువంటి ఫైన్ లేదు. కానీ ఇక నుంచి 25 వేల రూపాయలు ఫైన్ విధించనున్నారు.
- ట్రాఫిక్ లైన్ జంప్ చేసినా, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేసినా, రాంగ్ రూట్ లో ఓవర్ లోడ్ తో వెళ్లినా ప్రస్తుతం 1000 రూపాయల ఫైన్ విధిస్తున్నారు. ఇక నుంచి 5 వేల రూపాయల ఫైన్ విధించనున్నారు.
- నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించుకొనే వాహనాలకు ఒక్కో ప్రయాణికుడిపై రూ.200 చొప్పున జరిమానా విధించడంతోపాటు, అదనపు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం కల్పించిన తర్వాతే ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తారు.
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

కొత్త జరిమానాలు అమలు చేయ్యలేం!
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.