(Local) Wed, 02 Dec, 2020

అత్యంత విషమంగా జెట్లీ ఆరోగ్యం ..

August 19, 2019,   10:35 AM IST
Share on:
అత్యంత విషమంగా జెట్లీ ఆరోగ్యం ..

కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్వాసకోశ సమస్యలతో పాటు కిడ్నీలు పనిచేయని స్థితిలో 10 రోజుల క్రితం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స  పొందుతున్నారు.  అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి, నిన్న మధ్యాహ్నం నుంచి మరింత విషమంగా మారినట్టు వైద్య ఆరోగ్య వర్గాలు ధ్రువీకరించాయి.

స్వయంగా శ్వాస తీసుకోవడానికి జైట్లీ తీవ్రంగా ఇబ్బంది పడుతుండడంతో నిన్న సాయంత్రం నుండి  బెలూన్ పంప్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. కిడ్నీలు, గుండె పనితీరు మందగించింది. వైద్యులు ఆయనకు డయాలసిస్ నిర్వహించనున్నారు.ఈ సమాచారం అందగానే అమిత్ షా తదితరులు స్వయంగా ఆసుపత్రికి వచ్చి ఆయన క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం జైట్లీకి ఎయిమ్స్ కార్డియో అత్యవసర విభాగంలో ఐదుగురు వైద్యుల బృందం చికిత్సను అందిస్తోంది. నిన్న సాయంత్రం పలువురు బీజేపీ నేతలు హాస్పిటల్ కు వచ్చి ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లి .. జైట్లీ ఆరోగ్యంపై ఆరా తీశారు.

సంబంధిత వర్గం
తీవ్రమైన కడుపునొప్పితో ఎయిమ్స్ లో చేరిన చిదంబరం
తీవ్రమైన కడుపునొప్పితో ఎయిమ్స్ లో చేరిన చిదంబరం
అరుణ్‌ జైట్లీ ని పరామర్శించిన  ప్రముఖులలు
అరుణ్‌ జైట్లీ ని పరామర్శించిన ప్రముఖులలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.