(Local) Wed, 24 Jul, 2019

నామినేటేడ్ పదవులకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

July 04, 2019,   11:21 AM IST
Share on:

నామినేటేడ్ పదవులకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  అసంతృప్తులతో పాటు పార్టీలో కీలక సేవలు అందించిన వారికి ఈ పదవులు కట్టబెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇప్పటికే రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. మరి కొందరు నేతలకు కూడా నామినేటేడ్ పదవులు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. పలువురు నేతలకు ఈ పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం. 

మ‌హిళా క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్‌గా వాసిరెడ్డి ప‌ద్మ,మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీఏ చైర్మన్ పదవి, ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా మోహ‌న్‌బాబుకు అవ‌కాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఆర్టీసి ఛైర్మ‌న్‌గా అంబ‌టి రాంబాబు, కాపు కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా గ్రంధి శ్రీనివాస్ లేదా కొత్తపల్లి సుబ్బారాయుడు, బ్రాహ్మ‌ణ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ గా ద్రోణంరాజు శ్రీనివాస్‌, పోలీస్ హౌసింగ్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా యేసుర‌త్నం, సివిల్ స‌ప్లైస్ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా ఆమంచి కృష్ణ‌మోహ‌న్, ఎస్సీ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా మోషేన్ రాజు,వ‌క్ఫ్ బోర్డు ఛైర్మ‌న్‌గా మ‌హ్మ‌ద్ ముస్తఫాలను నియమించనున్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డిని ప్రాంతీయ బోర్డు చైర్మన్ గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ వీరినే ఫైనల్ చేస్తారా లేక కొంత మందిని మార్చుతారా అనేది వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.