(Local) Sat, 06 Jun, 2020

చిన్మయానంద్‌పై అత్యాచారం కేసులో లా విద్యార్థిని స్టేట్‌మెంట్‌

September 16, 2019,   4:26 PM IST
Share on:
చిన్మయానంద్‌పై అత్యాచారం కేసులో లా విద్యార్థిని స్ ...

చిన్మయానంద్‌పై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌ ఆరోపణలు చేసిన ఉత్తరప్రదేశ్‌ లా విద్యార్థిని స్టేట్‌మెంట్‌ తీసుకోవడం కోసం ఆమెను కోర్టుకు తీసుకొచ్చారు. అయితే ఆమెపై దాడులు చేసే అవకాశం ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టుకు తీసుకువచ్చే సమయంలో ఎవ్వరికీ కనబడకుండా ముఖానికి ముసుగేసుకుని తీసుకువచ్చారు. కేసు దర్యాప్తుకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని యూపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లా విద్యార్థిని కేసు విచారించేందుకు సుప్రీంకోర్టు సిట్‌ను ఏర్పాటు చేయడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది.

సిట్‌ పోలీసుల విచారణలో లా విద్యార్థి పలు ఆసక్తికర విషయాలను బయిటపెట్టింది. చిన్మయందా తనను ఎప్పుడు కలిసింది. ఆయన ఏ విధంగా వేధింపులకు పాల్పడింది వివరించింది. మొత్తం 12 పేజీల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేసినట్టు సమాచారం. విచారణలో భాగంగానే చిన్మయానందా తనకు ఆశ్రయమిచ్చి  స్నానం చేస్తుండగా వీడియోలు తీయించాడని చెప్పింది. వీడియో చూపించి తనను బ్లాక్‌మెయిల్‌ చేశాడని చెప్పింది. సంవత్సరకాలంగా పలుసార్లు అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపినట్టు సమాచారం. సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు వేధింపుల అంశాన్ని కొంతమంది న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో సుమోటాగా స్వీకరించింది.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.