(Local) Thu, 29 Oct, 2020

ముగిసిన విచారణ - మరి కాసేపట్లో కోర్టుకు చిదంబరం

August 22, 2019,   4:21 PM IST
Share on:
ముగిసిన విచారణ - మరి కాసేపట్లో కోర్టుకు చిదంబరం

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం విచారణ ముగిసింది. ఆయను దాదాపు మూడు గంటలకు పైగా సీబీఐ ప్రశ్నించింది. సీబీఐ చిదంబరంను 20 ప్రశ్నలు అడిగారు. ఐఎన్‌ఎక్స్‌ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ పాత్ర, హైకోర్టు ఆదేశాల అనంతరం కనిపించకపోవడానికి గల కారణాల గురించి సీబీఐ ప్రశ్నించింది. అయితే సీబీఐ అధికారులు ఆశించిన స్థాయిలో చిదంబరం స్పందించలేదు. విచారణకు ముందు ఆహారం ఇవ్వగా చిదంబరం తిరస్కరించారు. దీంతో అల్పాహారం ఇంటి నుంచి తెప్పించుకునేందుకు అనుమతినిచ్చారు. భోజనం తీసుకోవాలని చెప్పినా ఆయన తిరస్కరించారు. అయితే ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. మూడు గంటల పాటు విచారించినప్పటికీ చిదంబరం వారికి సహకరించలేదు. ఆయనను మరికాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

సంబంధిత వర్గం
డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట
డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.