(Local) Fri, 07 May, 2021

విజయవంతగా చంద్రయాన్ -2 కక్ష్యను పెంచిన ఇస్రో

August 03, 2019,   1:16 PM IST
Share on:
విజయవంతగా చంద్రయాన్ -2 కక్ష్యను పెంచిన ఇస్రో

ఇస్రో సంస్థ శుక్రవారం చంద్రయాన్-2 ఉపగ్రహం కక్షను పెంచే నాలుగో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శుక్రవారం మధ్యాహ్నం 3.27 గంటలకు ఉపగ్రహంలోని ప్రొపల్షన్ సిస్టమ్‌ను 646 సెకన్ల్ల పాటు మండించడం ద్వారా ఉపగ్రహం కక్షను మరింత పెంచినట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు ఉపగ్రహం పరిభ్రమణ కక్ష్య చంద్రుడికి చేరువలో 227 కిలోమీటర్లు, దూరంగా 89472 కిలోమీటర్లకు చేరుకున్నట్లు ఇస్రో తెలిపింది. ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలు మామూలుగా ఉన్నట్లు కూడా తెలిపింది. కాగా, ఉపగ్రహం కక్ష్య పెంపు చివరి ప్రయోగం ఈ నెల 6న జరుగుతుంది. ఇది విజయవంతమైతే ఉనగ్రహం చంద్రుడి ఆకర్షణ ప్రాంతానికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఉపగ్రహం ఈ నెల 20న చంద్రుడిని చేరుకోనుండగా, సెప్టెంబర్ 7న చంద్రుడిపై దిగుతుంది.

సంబంధిత వర్గం
చంద్రయాన్ 2 గురించి గుడ్‌న్యూస్ చెప్పిన ఇస్రో చీఫ్ ...
చంద్రయాన్ 2 గురించి గుడ్‌న్యూస్ చెప్పిన ఇస్రో చీఫ్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.