(Local) Sun, 20 Jun, 2021

కొత్త జరిమానాలు అమలు చేయ్యలేం!

September 14, 2019,   12:48 PM IST
Share on:
కొత్త జరిమానాలు అమలు చేయ్యలేం!

నూతన జరిమానాలు మేం అమలు చెయ్యలేం... మా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు... అంటూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న కొత్త ట్రాఫిక్‌ జరిమానాలపై రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. ఈ ప్రక్రియలో ముందు వరుసలో బీజేపీ
పాలిత రాష్ట్రాలే ఉండటంతో కేంద్ర ప్రభుత్వం తలలు పట్టుకుంది. నిజానికి మోటార్‌ వాహనాల సవరణ చట్టం అమల్లోకి వచ్చేముందే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది .ప్రమాదాలు తగ్గించడానికంటూ ట్రాఫిక్‌ నిబంధనల అతిక్రమణపై భారీ జరిమానాలు విధించాలన్న కేంద్రం అనాలోచిత చర్యపై దేశపౌరులు  భగ్గుమన్నారు. సోషల్‌ మీడియాలో కొత్త జరిమానాలకు వ్యతిరీకంగా తీవ్రంగా స్పందించారు. ముందు గుంతలు లేని రోడ్లు, మెరుగైన సౌకర్యాలు కల్పించి అప్పుడు జరిమానాలు విధించమని ట్రోల్‌ చేశారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త చట్టం అమలు ప్రారంభించింది. ఓవర్‌ లోడ్‌,అతివేగం, హెల్మెట్‌ లేకపోవడం వంటి తప్పులకు వేలు, లక్షల్లో వేసిన జరిమానాలకు 
ప్రయాణికులు బెంబీలెత్తిపోయారు. భారీ జరిమానాలు కట్టలేక వాహనదారులు పోలీసులకు వెహికల్స్‌ అప్పజెప్పి, వెళ్లిపోయిన సంఘటనలూ జరిగాయి.

ప్రయాణమంటేనే ప్రజలు భయపడే పరిస్థితి కల్సించింది కొత్త చట్టం. విమర్శలను లెక్కచేయకుండా కేంద్రం కొత్త జరిమానాలు అమలుచేస్తున్నప్పటికీ, ప్రజాగ్రహం గమనించిన రాష్ట్రాలు ఆ బాటలో నడవడానికి
సందేహించాయి. అందరికన్నా ముందుగా గుజరాత్‌ మేల్మొంది. జరిమానాలను తొంభై శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆగ్రహం, గుజరాత్‌ నిర్ణయం తర్వాత కూడా కేంద్రం తప్పుతెలుసుకోలేదు. కేంద్ర రవాణాశాఖా మంత్రి నితిన్‌ గడ్మరీ కొత్త చట్టాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చట్టం లేకపోతే  భయం ఎలా వస్తుందని, భారీగా జరిమానాలు పడుతుందన్న
భయంతో ప్రజలు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తారని గడ్మరీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. బీజేపీపై ఎప్పుడూ ఒంటికాలుతో లేచే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తమ. రాష్ట్రలో మోటార్‌ వెహికల్‌ సవరణ చట్టం అమలుచేయబోమని తేల్చిచెప్పేశారు. బీజేపీయేతర రాష్ట్రాలే కాకుండా, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కొత్తచట్టంపై తీవ్ర
వ్యతిరేకత వస్తున్న విషయం గమనించిన కేంద్రం ఎట్టకేలకు కాస్త వెనక్కి తగ్గింది. రవాణా కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాచితాలో ఉంటుంది కాబట్టి చట్టాన్ని యథాతథంగా అనుసరించాలా లేదా అన్నది రాష్ట్రాల ఇష్టమని, కేంద్రం నిర్ణయాన్ని బలవంతంగా రుద్దబోమని నితిన్‌ గడ్భరీ చెప్పారు.ఆయన వ్యాఖ్యలతో ఊపిరి పీల్చుకున్న రాష్ట్రాలు జరిమానాలను భారీగా తగ్గించేందుకు
సిద్దమయ్యాయి. మహారాష్ట్ర కర్షాటక, గోవా, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ వ్రదేశ్‌తో పాటు పలు బీజేపీ రాష్ట్రాలు జరిమానాల తగ్గింపు దిశగా చర్యలు చేపట్టాయి. ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టే ఈ కొత్త చట్టంపై కేంద్రం కూడా వెనక్కితగ్గి జరిమానాలను భారీగా తగ్గిస్తూ మళ్లీ సవరణలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వర్గం
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.