(Local) Tue, 20 Oct, 2020

జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీకారం

November 18, 2019,   11:21 AM IST
Share on:
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీ ...

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలకు అనుగుణంగా ఫలితాలు రాలేదన్న అభిప్రాయంతో ఉన్న బీజేపీ అధినాయకత్వం ఈసారి జార్ఖాండ్ ఎన్నికల్లో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈనెల 21 నుంచి జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొనేందుకు పార్టీ అధినాయకత్వం నిర్ణయించగా, అమిత్‌షా 20 బహిరంగసభలు, సమావేశాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం రాష్ట్రంలో 8 ర్యాలీల్లో ప్రసంగిస్తారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.