
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధీకరణను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దుచేసే అవకాశం ఉందని లడఖ్ వాసులు ఊహించారు. కానీ జమ్మూ కశ్మీర్ నుంచి లడఖ్ ను వేరు చేస్తారని మాత్రం వారిలో ఎవరూ ఊహించలేక పోయారు. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామానికి వారు అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాంస్కృతికంగా జమ్మూ కశ్మీర్ ప్రజలతో విభేదించే లడఖ్ వాసులు ఎప్పటి నుంచో ప్రత్యేక లడఖ్‌ను కోరుకుంటుండమే అందుకు కారణం.
లడఖ్ లో మొదటి నుంచి బౌద్ధులు ఎక్కువ. వారు 1934లో ‘లడఖ్ బౌద్ధుల సంఘం’ను ఏర్పాటు చేశారు. ‘ఫ్రీ లడఖ్ ఫ్రమ్ కశ్మీర్’ అంటూ వారు 1989లో ఆందోళన చేపట్టి తీవ్రతరం చేశారు. లడఖ్ ను వదిలి వెళ్లాల్సిందిగా ముస్లింలను హెచ్చరించారు. కశ్మీర్, లెహ్ జిల్లాకు చెందిన ముస్లింలపై ఆర్థిక ఆంక్షలను విధించారు. 1992లో వారు ఈ ముస్లింల బహిష్కరణను ఉపసంహరించుకున్నారు. లడఖ్ ప్రాంతం అభివృద్ధి కోసం 1995లో ‘లడఖ్ స్వయంప్రతిపత్తి గల జిల్లా కౌన్సిల్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినప్పటికీ వారిలో జమ్మూ కశ్మీరీల పట్ల బేధ భావం పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ చట్టం చేసినా కశ్మీర్ కేంద్రంగానే ఉండేవని, తమను చిన్న చూపు చూస్తున్నారనే భావం లడఖ్ వాసుల్లో ఎన్నడూ పోలేదు. కశ్మీర్లో జరిగే ఏ ఆందోళనతోనూ లడఖ్ కు సంబంధం లేకపోయినా, కశ్మీర్లో కాలేజీలు మూసివేస్తే లడఖ్ లో మూసివేయాల్సి వచ్చేది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కారీ లడఖ్ ప్రాంతంలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని హామీ ఇచ్చారు. అది అమలు జరుగుతుందని కూడా ప్రజలు భావించలేదు.
ఇప్పుడు అనూహ్యంగా లడఖ్ ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించడం ఆశ్చర్యంగా ఉందని లెహ్‌లోని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు త్సేరింగ్ నామ్‌గ్యాల్ వ్యాఖ్యానించారు. పార్టీలతో ప్రమేయం లేకుండా తమ ప్రాంతం వేరైనందుకు తామంతా ఆనందిస్తున్నామని ఆయన చెప్పారు. లెహ్ జిల్లా నుంచే ప్రత్యేక లడఖ్ ఉద్యమం పుట్టిందని లడఖ్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు హుస్సేన్ఖలో తెలిపారు. లడఖ్ లోనే ఉన్నప్పటికీ లెహ్, కార్గిల్ జిల్లా వాసులకు పడదని, కార్గిల్ వాసులు కశ్మీర్‌వాసులతోనే కలుస్తారుగానీ లెహ్ వాసులతో కలవరని కార్గిల్ జిల్లాలో ఉంటున్న హుస్సేన్ఖలో చెప్పారు. లడఖ్ నుంచి కార్గిల్‌ను వేరు చేయాల్సిందిగా మరో డిమాండ్ త్వరలోనే తెరపైకి రావచ్చని ఆయన చెప్పారు.
-
ఐఎస్ఐ హిట్ లిస్ట్ లో జమ్మూ గవర్నర్!
08 Nov 2019, 10:25 AM
-
నేటి నుండి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన జమ్ము ...
31 Oct 2019, 1:07 PM
-
లడఖ్ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథూర్ ప్రమాణ స్వీకారం
31 Oct 2019, 12:50 PM
-
జమ్మూకశ్మీరు, లడఖ్ కి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ల ...
26 Oct 2019, 1:07 PM
-
జమ్ముకాశ్మీర్,లడక్ ప్రాంతాల ఉద్యోగులకు ఏడోవేతన స ...
23 Oct 2019, 1:14 PM
-
కాశ్మీర్ విషయమై చైనాకు భారత్ గట్టి కౌంటర్
29 Sep 2019, 10:51 AM
-
భారత సైనికులను రెచ్చగొట్టేలా వ్యవహరించిన చైనా
12 Sep 2019, 4:00 PM
-
పీవోకే ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమే : రాజ్‌నాథ్ స ...
30 Aug 2019, 10:33 AM
-
లడక్ లోని సైనికులతో ధోని సందడి
16 Aug 2019, 1:04 PM
-
స్పష్టమైన విధానం వల్లే ...మార్పులు సంభవించాయి - మ ...
14 Aug 2019, 1:23 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

ఐఎస్ఐ హిట్ లిస్ట్ లో జమ్మూ గవర్నర్!
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.