(Local) Sun, 27 Sep, 2020

గృహ నిర్బంధంలో కశ్మీర్‌ మాజీ సిఎంలు

August 05, 2019,   11:29 AM IST
Share on:
గృహ నిర్బంధంలో కశ్మీర్‌ మాజీ సిఎంలు

జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. గత రెండు రోజులుగా భారీగా సైన్యాన్ని కేంద్రం జమ్మూలో మోహరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఆర్టికల్ 35 తో పాటు, 370 డి ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆర్టికల్స్ కాశ్మీరీలకు స్వయంప్రతిపత్తిని కల్పించాయి. ఈ ఆర్టికల్స్ ను రద్దు చేస్తే ఊరుకునేది లేదని ప్రతిపక్ష పార్టీలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో నేడు ఏదో జరగబోతోందన్న అనుమానాలు మరింత బలపడ్డాయి.

తమను అదుపులోకి తీసుకోవడంపై మాజీ సీఎంలు ట్వీట్ చేశారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఒమర్ అబ్దుల్లా పిలుపునివ్వగా, సోమవారం ఏం జరగబోతోందో దేవుడికే తెలియాలని మెహబూబా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్‌, సీపీఎం ఎమ్మెల్యే ఎం.వై.తరిగామిలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నా పోలీసులు ధ్రువీకరించలేదు. కాగా, నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూతపడనున్నాయి.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
పోస్టల్‌ సేవలు పునరుద్ధరించిన పాక్‌!
పోస్టల్‌ సేవలు పునరుద్ధరించిన పాక్‌!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.