(Local) Wed, 20 Oct, 2021

భారత్ లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకొంటుంది: అమెరికా

September 09, 2019,   12:05 PM IST
Share on:
భారత్ లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకొంటుంది: అమెరికా

భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన చంద్రయాన్ -2 పై ఇప్పటికే ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా కూడా స్పందించింది. భారత్ అంతరిక్ష ప్రయోగాలలో కెల్లా చంద్రయాన్ -2 ఉత్తమమమైనదని కొనియాడింది. ఈ మేరకు అగ్రరాజ్యం ప్రతినిధి అలైస్ జీ వెల్స్ ఆదివారం ట్విట్టర్ ద్వారా భారత్ ఖ్యాతిని ప్రశంసించారు. చంద్రయాన్ -2 మీద ఇస్రో పెట్టిన ఏకాగ్రత, శ్రద్ద అనితరసాధ్యమని ఆయన ప్రశంసించారు. శాస్త్రీయ పురోగతికి ఇది నాంది అని, త్వరలోనే భారత్ తాను ఆశిస్తున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు.

సంబంధిత వర్గం
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.