(Local) Sun, 20 Jun, 2021

తొలి సమావేశానికి డుమ్మా కొట్టిన అజిత్ పవార్

November 25, 2019,   11:32 PM IST
Share on:
తొలి సమావేశానికి డుమ్మా కొట్టిన అజిత్ పవార్

మహారాష్ట్ర సీఎంగా రెండ్రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. వెంటనే రైతులను ఆదుకునేందుకు 5వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తూ ఫైల్ పై సంతకం పెట్టిన తర్వాత అధికారులతో రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల్లో సమాచాలోచనలు జరిపారు. అయితే సీఎం ఫడ్నవీస్ నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హాజరుకాలేదు. ఎన్సీపీలోకి రావాలని.. శరద్ పవార్ నేతృత్వంలో పనిచేయాలని ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సీఎం రివ్యూ మీటింగ్ కు వెళ్లేలేదనే ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.