(Local) Sun, 27 Sep, 2020

అరుణ్ జైట్లీ ఆరోగ్యంపై ఎయిమ్స్ హెల్త్ బులెటిన్

August 09, 2019,   10:03 PM IST
Share on:
అరుణ్ జైట్లీ ఆరోగ్యంపై ఎయిమ్స్ హెల్త్ బులెటిన్

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా శుక్రవారం ఎయిమ్స్‌లో చేరారు. ఛాతిలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ను హాస్పిట్‌కు తీసుకెళ్లారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతోపాటు బీజేపీకి చెందిన ముఖ్య నేతలు శుక్రవారం రాత్రి ఎయిమ్స్‌కు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. పార్టీ పెద్దలంతా ఎయిమ్స్‌కు చేరుకోవడంతో జైట్లీ ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళన తలెత్తింది. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.  ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. గుండె నుంచి రక్తనాళాల ద్వారా శరీరం అంతటికీ రక్తం నిలకడగా ప్రసరిస్తోందని, శరీరంలోని కణాలన్నింటికి ఆక్సిజన్ సరఫరా జరుగుతోంద’’ని ఎయిమ్స్ చైర్‌పర్సన్ డాక్టర్ ఆర్తి తెలిపారు. మరో హెల్త్ బులెటిన్‌ రాత్రి 10.30 గంటలకు వెలువడే అవకాశం ఉంది. 

 

 

సంబంధిత వర్గం
తీవ్రమైన కడుపునొప్పితో ఎయిమ్స్ లో చేరిన చిదంబరం
తీవ్రమైన కడుపునొప్పితో ఎయిమ్స్ లో చేరిన చిదంబరం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.