(Local) Wed, 21 Oct, 2020

జపాన్ లో పెను తుఫాను బీభత్సం...

October 13, 2019,   1:01 PM IST
Share on:
జపాన్ లో పెను తుఫాను  బీభత్సం...

జపాన్ లోని టోక్యోతోపాటు పరిసర ప్రాంతాలన్నీ శనివారం ముంచుకొచ్చిన హగిబిస్ అనే పెనుతుపాను బీభత్సంతో అల్లాడుతున్నాయి. హగిబిస్ అంటే ఫిలిపినో భాషలో స్పీడ్ అని అర్థం. గత అరవై ఏళ్లలో ఇలాంటి భయంకర తుపాను సంభించలేదని జపాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. టోక్యోకు నైరుతి భాగంలో వీధులు, బీచ్‌లు, రైలు స్టేషన్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. టోక్యోతోపాటు గున్మా, సైతమా, కనగవ, ఫుకుషిమ, మియాగి తదితర ప్రాంతాల్లో తుపాను విస్తరించింది. షిజౌకాలో శనివారం సాయంత్రం భూకంపం సంభించిన తరువాత తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. టోక్యోకు సమీపాన చిబా తీరం సముద్రంలో 59.5 కిమీ లోతున 5,3 రెక్టార్ స్కేలు స్థాయిలో భూకంపం కేంద్రీకృతమైందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.ఈ ప్రాంతాల ప్రజలు రక్షణ చర్యలు తీసుకోవాలని వాతావరణ సంస్థ అధికారి యషుషి కజిహర హెచ్చరించారు. చిబా తీరం నుంచి విజృంభించిన తుపాను వల్ల ఇచిహర నగరంలో కారు తలకిందులై అందులోని వ్యక్తి మరణించాడు. మరో ఇంటిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ సమాచార ప్రసార కేంద్రం ఎన్‌హెచ్‌కె ఇద్దరు చనిపోగా, నలుగురు గల్లంతు అయ్యారని, 51 మంది గాయపడ్డారని వెల్లడించింది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.సముద్ర అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. లంగరు వేసిన బోట్లు చెల్లాచెదురయ్యాయి. వరద నీటిలో కార్లు తేలియాడుతున్నాయి. నిషికవ నది ఉప్పొంగి గల్లంతైన ఇద్దరిలో ఒకరిని రక్షించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.