(Local) Sun, 27 Sep, 2020

బీజేపీలో చేరిన 10 మంది ఎమ్యెల్యేలు

August 14, 2019,   11:21 AM IST
Share on:
బీజేపీలో చేరిన 10 మంది ఎమ్యెల్యేలు

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోలేని బీజేపీ.. ఒక్కరోజులోనే రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పటివరకు ప్రతిపక్షంగా ఉన్న సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు మంగళవారం రాంమాధవ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. సిక్కిం మినహా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యక్షంగానో పరోక్షంగానే అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల చేరికతో బీజేపీ బలపడింది. సిక్కింలో మొత్తం 32 నియోజకవర్గాలు ఉండగా సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ 15మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. సిక్కిం క్రాంతికారి మోర్చా 17 స్థానాలు గెలుచుకుని అధికారం కైవసం చేసుకుంది. స్వల తేడాతో అధికారం మిస్ చేసుకున్న సిక్కి డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు… ఒక్క సీటు గెలవని బీజేపీలో చేరారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా మారింది

సంబంధిత వర్గం
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.