(Local) Fri, 05 Jun, 2020

కోదండరామ్ మద్దతు కోరిన ఉత్తమ్

September 22, 2019,   6:38 PM IST
Share on:
కోదండరామ్ మద్దతు కోరిన ఉత్తమ్

హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సీఈసీ ఎన్నికల తేదీని ప్రకటించడంతో పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ను కలిసి మద్దతు కోరారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సహకరించాలని అడిగారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ తమ పార్టీనేతలతో సమావేశమై రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానని ఉత్తమ్ కు చెప్పారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై ఇరువురు నేతలు గంటపాటు చర్చించుకున్నారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.