(Local) Wed, 21 Aug, 2019

రేపు వరంగల్ పర్యటనకు కేసీఆర్

August 13, 2019,   5:04 PM IST
Share on:

సీఎం కేసీఆర్ ఈ నెల 14న వరంగల్ రూరల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామానికి రానున్నారు. పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి ఈ నెల 4న అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, బుధవారం దశదినకర్మ కార్యక్రమానికి సీఎం హాజరై ఎమ్మెల్యేను పరామర్శించనున్నారు. పెద్దపెల్లి జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరై అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ప్రగతి సింగారం గ్రామానికి రానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, సీపీ డాక్టర్ విశ్వనాథ రవీందర్, కలెక్టర్ ఎం.హరిత హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత వర్గం

పోర్న్ సైట్లు కట్టడి చెయ్యాలని గూగుల్ కు హై కోర్ట్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.