(Local) Fri, 05 Jun, 2020

మంత్రివర్గ విస్తరణ యోచనలో కేసీఆర్ ప్రభుత్వం

August 28, 2019,   11:12 AM IST
Share on:
మంత్రివర్గ విస్తరణ యోచనలో కేసీఆర్ ప్రభుత్వం

సిఎం కేసీఆర్  నేడు తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించనున్నట్టు తెలుస్తోంది. టిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ , ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డితోపాటు టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు పెద్ద పీట వేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకుంటానని ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కూడా పదవి లభించే చాన్స్ ఉందని సమాచారం.

మంత్రి పదవుల జాబితాలో సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కూడా ఉన్నారు. అయితే, ఈసారి కేసీఆర్ పూర్తిస్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరిస్తారా? లేక మళ్లీ పాక్షికమేనా? అన్నది తెలియరాలేదు.అన్నీ అనుకున్నట్టు జరిగితే నేడు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఈ రోజు కాకుంటే వచ్చే నెల 4, 12వ తేదీలలో విస్తరణ కానీ, లేదంటే పునర్ వ్యవస్థీకరణ కానీ ఉంటుందని టిఆర్‌ఎస్‌ వర్గాల సమాచారం. ఇక, గత కేబినెట్‌లో మహిళలకు స్థానం కల్పించలేదన్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు ఈసారి ఏకంగా ఇద్దరు మహిళలకు చోటు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.