(Local) Fri, 29 May, 2020

ప్రియాంక హత్య కేసు నిందితుల అరెస్టు

November 29, 2019,   12:06 PM IST
Share on:
ప్రియాంక హత్య కేసు నిందితుల అరెస్టు

ప్రియాంక రెడ్డి కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ప్రియాంకరెడ్డి పై గ్యాంగ్ రేప్ జరిగినట్టు నిర్దారించారు. టోల్ ప్లాజా వద్ద అఘాయిత్యానికి పాల్పడ్డ లారీ డ్రైవర్ తో పాటు క్లీనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడిగా మహ్మద్ పాషాను పోలీసులు గుర్తించారు. పాషా స్వస్థలం నారాయణపేట జిల్లా. పంక్చర్ చేయిస్తామని వీరు ప్రియాంకను తప్పుదోవ పట్టించారు. ఆ తర్వాత లారీ ట్రక్కు వెనుక భాగంలో గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు. అక్కడి నుంచి ప్రియాంక శవాన్ని ట్రక్కులో వేసుకొని చటానుపల్లి బ్రిడ్జి కింద కిరోసిన్ పోసి కాల్చారు. ఈ ట్రక్కు వెనుకాలే మరో వ్యక్తి ప్రియాంక స్కూటీని నడుపుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత స్కూటీని వదిలి అంతా వెళ్లిపోయారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా ప్రియాంక పై గ్యాంగ్ రేప్ జరిగినట్టు తేలింది. అదే విధంగా 70 శాతం గాయాలయ్యాయని, కిరోసిన్ పోసే ప్రియాంకను కాల్చారని డాక్టర్లు నిర్దారించారు. దీని పై పోలీసులు మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.